TELANGANA: మద్యం లాటరీలకు నోటిఫికేషన్‌!

రాష్ట్రంలో వైన్‌షాప్‌లకు లైసున్సులు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది. వచ్చే రెండేళ్లకు (2023-25) సంబంధించి లైసెన్స్‌ ప్రక్రియకు ఈ వారంలో నోటీఫికేషన్‌ జారీ చేయనుంది. ఇది శుక్రవారమే విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆగస్టు మూడో వారంలోనే లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ షారూఖీ, ఇతర ఉన్నత అధికారులు సమావేశం నిర్వహించారు. ఆక్షన్‌ ప్రక్రియపై వాళ్లకు మార్గనిర్దేశం చేశారు.

గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, రిజర్వేషన్లు యథాతథంగా అమలవుతాయని సమాచారం. 2021-23 సంవత్సరాలకు ఉన్న మద్యం పాలసీలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..