Akira Nandan – పవన్ తనయుడు సినిమాల్లోకి వస్తాడా..రాడా?

పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది అకిరా తల్లి రేణుదేశాయ్. ప్రస్తుతానికి అకిరాకు నటనపై ఆసక్తి లేదని తేల్చేసింది రేణుదేశాయ్. భవిష్యత్తులో అతడు ఏమౌతాడో తను చెప్పలేనని… దయచేసి, తను ఏది పోస్టు చేసినా ప్రతిసారి దానిపై ఏదో ఒక పుకారు సృష్టించొద్దని రిక్వెస్ట్ చేస్తోంది. నిజంగా అకిరా యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకుంటే, ఆ విషయాన్ని తనే ముందుగా అందరికీ చెబుతానని ప్రామిస్ చేస్ోతంది. అయితే ఈసారి రేణుదేశాయ్ ప్రకటనను ఎవ్వరూ నమ్మడం లేదు.

ఎందుకంటే, ఓవైపు అకిరాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదంటూ రేణు దేశాయ్ ప్రకటిస్తే, మరోవైపు అకిరా వెళ్లి న్యూయార్క్ లోని ఫిలింస్కూల్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రకటించారు. సో.. అటు అకిరా చేస్తున్న పనులకు, ఇటు రేణు దేశాయ్ ఇస్తున్న ప్రకటనలకు పొంతన కుదరడం లేదు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం తాజా పరిణామాలతో పండగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ నటవారసుడు అకిరా, సినిమాల్లోకి రావడం గ్యారెంటీ అని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. 19 ఏళ్ల అకిరా, ఏ క్షణానైనా సినిమాల్లోకి వస్తాడనేది వాళ్ల నమ్మకం. అకిరా ఇప్పటికే పియానో నేర్చుకున్నాడు. అతడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మరోవైపు చదువుల్లో కూడా చురుగ్గా ఉన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం