వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. వరుస గెలుపులతో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్స్‌కు చేరింది. అయితే ఈ విజయాల్లో పేసర్ మహ్మద్ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. రెండు సార్లు అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అయితే షమి గురించి బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారితీసింది. షమి ఒప్పుకుంటే ఏకంగా పెళ్లిచేసుకోవడానికి రెడీ అంటూ ప్రపోజల్ చేసింది. అయితే పాయల్ ఓ కండిషన్ పెట్టింది. షమి తన ఇంగ్లిష్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ట్వీట్ పాయల్ ఘోష్ సరదాగా చేసినా.. నెటిజన్లు మాత్రం సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. షమి పరిస్థితుల గురించి తెలుసుకొని రియాక్ట్ అవ్వాలని కొందరు కామెంట్ చేయగా, ప్రేమకు భాషతో పనేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే షమి తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. గృహహింస కేసులు, ఫిక్సింగ్ ఆరోపణలు, యాక్సిడెంట్ ఇలా.. తనని ఆటకు కొన్నేళ్లు దూరం చేశాయి. అతడి 11 ఏళ్ల కెరీర్‌లో ఐదేళ్లపాటు గాయాలు, కుటుంబ వివాదాల కారణంగా కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా అతడి జీవితంలో 2018లో పెనుతుపానే వచ్చింది. భార్య పెట్టిన గృహ హింస కేసుతో పాటు ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. అదే ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా నిలిచిపోయింది. ఈ పరిణామాలపై టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతడు ఒక్కసారిగా విలపించాడు. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న దిల్లీ డేర్ డెవిల్స్ కూడా 2019 సీజన్‌కు ముందు ఐపీఎల్‌లో అతడిని వదులుకుంది. ఇవన్నీ అతడికి వరుస షాకులే. కానీ, షమి కుంగిపోకుండా దేశం తరఫున మైదానంలో గొప్పగా పోరాడుతున్నాడు. ‘మిష్టర్ వన్డే ప్రపంచకప్’గా సంచలన ప్రదర్శన చేస్తున్నాడు.
మరోవైపు నటి పాయల్ ఘోష్ తెలుగు అభిమానులకు సుపరిచితమే. ‘ప్రయాణం’ చిత్రంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా బాలకృష్ణతో దిగిన ఫొటో షేర్ చేసిన పాయల్ బాలీవుడ్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. ‘బాలకృష్ణ గారు ఈ వయసులోనూ సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆయన్ని చూసి నేర్చుకోవాలి’ అంటూ ఆమె ట్విటర్‌లో రాసింది. ఇక పాయల్.. 2020లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది.