ఎంత పని చేశావ్‌రా వరుణ్- సాయిధరమ్ తేజ్

తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో రిస్పెషన్‌ ఘనంగా నిర్వహించారు. అయితే వరుణ్‌ పెళ్లిలో చేసిన హంగామాను సాయి ధరమ్‌ తేజ్‌ కాస్త లేట్‌గా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. వరుణ్ తేజ్‌ని పెళ్లి కొడుకు చేసి ఊరిగేంచిన సమయంలో సాయి ధరమ్‌ తేజ్‌ కారును ఆపి రచ్చ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి.. ”ఎందుకు, క్యూ, ఎన్‌, వైయ్‌? ఎంత పని చేశావ్‌రా వరుణ్‌ బాబు.. నీకు పెళ్లి సంబంరాలు, నాకు నా స్వతంత్ర పోరాటం” అంటూ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీలో మ్యారేజ్‌ చేసుకునే లిస్ట్‌లో నెక్స్ట్‌ సాయ్‌ ధరమ్‌ తేజ్‌ ఉండటంతో.. ఇలా తన బ్యాచిలర్‌ లైఫ్ పోరాటం కోసం పోస్ట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం