WIvIND: టీమిండియా ఓటమి

టెస్టు, వన్డే సిరీస్‌లు సాధించిన భారత్‌ టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారీ టార్గెట్‌ కాకపోయినా స్లోపిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (39; 22 బంతుల్లో) ఆకట్టుకున్నాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. శుభారంభం దక్కకపోయినా కెప్టెన్ పావెల్‌ (48), పూరన్‌ (41) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ క్రీజులో నిలబడటంతో విండీస్‌ భారీస్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి స్కోరును కట్టడి చేశారు. చాహల్, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు, హార్దిక్, కుల్‌దీప్‌ తలో వికెట్‌తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ ఓపెనర్లు నిరాశపరిచారు. శుభమన్‌ గిల్ (3), ఇషాన్‌ కిషాన్‌ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (21), తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తిలక్ వరుసగా రెండు సిక్సర్లు బాది దూకుడుగా తన ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. కానీ మరో భారీ షాట్‌కు యత్నించి షెఫార్డ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయినా హార్దిక్‌ (19), సంజు శాంసన్‌ (12) ఉండటంతో టీమిండియా గెలుపుపై ధీమాగానే ఉంది. కానీ 16వ ఓవర్‌లో వీరిద్దరు వెనుదిరిగారు. ఆఖర్లో అక్షర్‌ (13), అర్షదీప్ (12) పోరాడినా ఓటమి తప్పలేదు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం