వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 351/5 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన విండీస్ 151 పరుగులకే కుప్పకూలింది.
యువ ఓపెనర్లు ఇషాన్ కిషాన్ (77), శుభమన్ గిల్ (85) మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. ఇద్దరూ సాధికారికంగా ఆడుతూ బౌండరీలు రాబట్టారు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8) త్వరగానే ఔటైనా.. సంజు శాంసన్ (51) దూకుడుగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆఖర్లో హార్డిక్ పాండ్య (70*) అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (35), జడేజా (8)తో కలిసి చివరి పది ఓవర్లలో 94 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖర్లో అల్జారి జోసెఫ్ (26), మొటి (39*) పరుగులు చేయడంతో 151 స్కోరు అయినా సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ ఠాకూర్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, ఉనద్కత్ ఒక వికెట్ పడగొట్టారు.