అంత ఈజీ కాదు.. విండీస్‌తో నేడే తొలి టీ20

టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం. ఇక పొట్టి ఫార్మాట్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే టీ20ల్లో విండీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భీకరమైన హిట్టర్లు, టాప్ ఆల్‌రౌండర్లు ఆ జట్టులో ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే మ్యాచ్‌ను తారుమారుచేసే సత్తా వారికి ఉంది. ఇటీవల అమెరికాలో జరిగిన లీగ్‌లో నికోలస్‌ పూరన్‌ మెరుపు శతకం సాధించడం వారికి సానుకూలాంశం. సొంతగడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ కోల్పోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను అయినా సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది.

మరోవైపు టీమిండియా పొట్టిఫార్మాట్‌ సిరీస్‌ను కూడా సాధించాలని ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్‌ లేకపోయినా కీలక మ్యాచ్‌లో కుర్రాళ్లు అదరగొట్టి వన్డే సిరీస్‌ను సాధించారు. ఇది వారికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే తుదిజట్టు ఎంపికే ఇప్పుడు అసలు సవాలుగా మారింది. జట్టులో ఓపెనర్లు శుభమన్ గిల్‌, ఇషాన్‌ కిషాన్‌, యశస్వి జైశ్వాల్‌ ఉన్నారు. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌గా వారు ఆడే ఛాన్స్‌ ఉంది. అయితే సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌ ఆటగాళ్లలో ఇద్దరికే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. కాగా, ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం