Weather Alert- రేపు భారీ వర్షాలు

తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శుక్రవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. శుక్రవారం ఉరుములు మెరుపులతో వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..