స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ డిఫ్రెంట్గా రన్నింగ్ చేసి ఫన్నీ ఇన్సిండెట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఫైనల్కు చేరిన టీమిండియాకు బంగ్లాదేశ్తో మ్యాచ్ నామమాత్రంగా మారింది. దీంతో కోహ్లితో పాటు హార్దిక్, సిరాజ్,బుమ్రా, కుల్దీప్కు విశ్రాంతినిచ్చారు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ వాటర్బాయ్గా అవతారమెత్తాడు. బంగ్లా జట్టు రెండో వికెట్ పడిన సమయంలో ఆటగాళ్లకు కోహ్లి వాటర్ అందించాడు. అయితే ఆ సమయంలో అతడు పరిగెత్తిన తీరు చాలా సరదాగా ఉంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. కోహ్లి కామెడీ టైమింగ్ సూపర్ అని, మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాటర్ బాయ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.