రహస్యంగా పోర్న్ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్ యుగంలో మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. నిందితుడిపై నమోదైన FIRను కొట్టేశారు. 2016లో కొచ్చిలోని అలువా ప్యాలెస్ సమీపంలో రోడ్డు పక్కన 33ఏళ్ల వ్యక్తి పోర్న్ చూస్తూ పోలీసులకు దొరికాడు. దీంతో IPC 292 కింద కేసు నమోదు చేశారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.