TIPS:సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్‌ చదివేయండి!!

సొంత కారు అనేది అందరి కల. కానీ కొత్త కారు కొనడానికి ఆర్థిక పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని కొనుగోలు చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సార్లు విక్రయదారుడు చేతిలో మోసపోతుంటాం. గతంలో జరిగిన ప్రమాదాల విషయాలు తెలియనివ్వకుండా అమ్మే ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా మోసపోకుండా కారు ప్రమాద చరిత్రను కనుగొనేందుకు కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవి…

టిప్‌ నంబర్‌1 సర్వీస్‌ రికార్డ్‌.. కారు ప్రమాద చరిత్రను తెలుసుకోవడానికి సర్వీస్ రికార్డ్‌ను తనిఖీ చేయాలి. కారులో ఏయే భాగాలను రిపేర్ చేశారు, ప్రమాదం తర్వాత మరమ్మతు చేయబడిందా లేదా అనే విషయాలు తెలుసుకోవచ్చు.

రెండవది విండ్‌షీల్డ్.. ఇది కూడా కారు ప్రమాద చరిత్ర గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు విండ్‌షీల్డ్ విరిగిపోతుంది లేదా కనీసం పగుళ్లు అయినా ఏర్పడతాయి. కాబట్టి విండ్‌షీల్డ్‌పై ఏదైనా గుర్తును చూసినట్లయితే అది ప్రమాదం జరిగిన సంకేతం అవ్వొచ్చు.

టిప్‌ నంబర్‌ 3.. కారు బాహ్య భాగాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ప్రమాద గుర్తులు సాధారణంగా బయటి భాగంలో ఎక్కువగా ఉంటాయి. కారు బంపర్, సైడ్‌లను తనిఖీ చేయాలి. ఈ ప్రదేశాలలో ఎక్కువ గీతలు ఉంటే, కారు ప్రమాదానికి గురైందని మీరు అర్థం చేసుకోవాలి. కానీ బాహ్య భాగాల్లో ఉండే చిన్న గీతలు పెయింటింగ్‌, రిపైర్‌తో కవర్‌ చేస్తుంటారు. ఈ టిప్స్‌ను పాటిస్తే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం