పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయంపై గత రెండేళ్లుగా ఆలోచిస్తున్నాని, ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. 38 ఏళ్ల రియాజ్ చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అతడు తెలిపాడు. పాక్‌కు ప్రాతినిధ్యం వహించింనందకు ఎంతో గర్వపడుతున్నా అని అన్నాడు.
రియాజ్-షేన్ వాట్సన్ మధ్య జరిగిన ఆసక్తికర పోరు క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేరు. 2015 ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా పాక్-ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో షేన్ వాట్సన్‌ను రియాజ్ బెంబేలెత్తించాడు. వీరిద్దరు మధ్య జరిగిన ఆట ఆసక్తిగా సాగింది. కాగా, ఎడమచేతి వాటం పేసర్ అయిన రియాజ్ పాక్ తరఫున 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 237 వికెట్లు పడగొట్టాడు.