Conjunctivitis:కళ్లకలకు కళ్లెం ఇలా వేద్దాం..

ప్రస్తుతం కళ్లకలక (Conjunctivitis) మరో మహమ్మారిలా మారింది. ఒకరి నుంచి మరొకరికి తేలికగా, త్వరగా వ్యాపిస్తోంది. సమస్య చిన్నదే అయినా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత నొప్పి. కంట్లోంచి ఒకటే నీరు, ఏ పని చేయలేం. పడుకున్నా నిద్ర పట్టని పరిస్థితితో వేధిస్తోంది. అయితే కన్‌జన్‌క్టివైటిస్‌ ఒకట్రెండు వారాల్లో దానంతటదే తగ్గిపోయినా దీర్ఘకాల సమస్యలకూ దారితీయెచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటికి బలాన్ని చేకూర్చే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎలా వస్తుంది?
కంటిలోని కన్‌జన్‌క్టెవా పొర కన్నీరు, జిగురుద్రవం ఉత్పత్తయ్యేలా చేసి నేత్రాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంటుంది. కన్నీటిలోని లైసోజోమ్‌ ఎంజైమ్‌ను కంటి నిండా విస్తరించేలా బాధ్యత నిర్వర్తిస్తుంటుంది. అయితే ఈ కన్‌జన్‌క్టెవా పొర ఉబ్బటమే కళ్లకలకకు దారితీస్తుంది. దీనికి వైరస్‌, బ్యాక్టీరియా, అలర్జీల వంటివేవైనా కారణం అవుతుంటాయి. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నఈ వ్యాధికి కారణం అడినో వైరస్‌.

కంటికి బలం
సాధారణంగా విటమిన్‌-ఎ ఉండే ఆహారం కంటికి ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా విటమిన్‌-ఎ ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు. పాలకూర, పార్స్‌లీ లాంటి ఆకుకూరల్లోఉండే లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటిని కాపాడుతుంటాయి. అంతేగాక క్యారట్‌, చిలగడదుంపలు, బొప్పాయి, గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి సాయపడుతుంది. గుడ్లు, చేపలు, బాదం, వాల్‌నట్‌, ఫ్లాక్స్‌ సీడ్స్‌, సన్‌ ఫ్లవర్‌ గింజలు ఆహారంలోకి చేర్చుకోవడం ఎంతో మంచింది.

అంతేగాక విటమిన్-సి ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంటుంది. విటమిన్‌-ఇ ఉండే వెజిటేబుల్‌ నూనెలు కూడా కంటికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంటాయని తెలిపారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం