vishal
Home » హీరోయిన్ తో విశాల్ పెళ్లి.. ఇది ఎంతవరకు నిజం?

హీరోయిన్ తో విశాల్ పెళ్లి.. ఇది ఎంతవరకు నిజం?

by admin
0 comment

కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి గతంలో పల్నాడు, ఇంద్రుడు చిత్రాల్లో నటించారు. పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2019లో అనీషా రెడ్డితో విశాల్ కు ఎంగేజ్ మెంట్ జరగ్గా, తర్వాత పలు కారణాల వల్ల ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్టు విశాల్ ప్రకటించాడు. అప్పట్నుంచి బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు విశాల్ పెళ్లికి ముడిపెడుతూ లక్ష్మీ మీనన్ పేరు తెరపైకొచ్చింది. నిజానికి ఈ పుకార్లు కొత్తవేం కాదు. ఇంద్రుడు సినిమా టైమ్ లోనే లక్ష్మీ మీనన్ తో విశాల్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడంటూ పుకార్లు వచ్చాయి.

అయితే అప్పట్లో వాటిని చాలామంది పట్టించుకోలేదు. ఎందుకుంటే, అప్పటికే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో తెగతెంపులు చేసుకున్నాడు విశాల్. ఆ తర్వాత అనీషా రెడ్డితో పెళ్లిని కూడా బ్రేకప్ చేసుకున్నాడు. కాబట్టి, ఇలాంటి టైమ్ లో లక్ష్మీ మీనన్ తో డేటింగ్ అంటూ వచ్చిన పుకార్లను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఉన్నట్టుండి సడెన్ గా ఇప్పుడు అవే పుకార్లు మళ్లీ తెరపైకి రావడంతో, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పుకార్లకు మరితం ఊతమిస్తూ.. విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించడం లేదు. ప్రస్తుతం 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్న విశాల్, ఈ ఏడాదిలోనే లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం విశాల్ వయసు 45 సంవత్సరాలు. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరోల్లో ఒకడు విశాల్.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links