Virat Kohli – KL Rahul : కోహ్లి వద్దన్నాడు.. రాహుల్ పట్టుబట్టాడు

బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం విరాట్ సెంచరీకి రాహుల్ సపోర్ట్‌ చేయడమే. కోహ్లికే ఆఖరి వరకు స్ట్రైక్‌ వచ్చేలా రాహుల్‌ చేశాడు. అయితే కోహ్లి స్ట్రైక్‌ రొటేట్‌ చేసేందుకు మధ్యలో ప్రయత్నించాడని, కానీ తాను వద్దన్నాని రాహుల్ చెప్పాడు. ”కోహ్లి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నిస్తే వద్దని చెప్పా. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండదని కోహ్లి అన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారన్నాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదని కోహ్లీకి చెప్పాను. సెంచరీ పూర్తిచేయమని చెప్పాను” అని రాహుల్ తెలిపాడు. విజయానికి 26 పరుగుల అవసరమైన సందర్భం నుంచి రాహుల్ ఒక్క పరుగు కూడా చేయలేదు.

కాగా, వన్డేల్లో కోహ్లికి ఇది 48వ సెంచరీ. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా సచిన్‌ తెందుల్కర్‌ నిలిచాడు. సచిన్‌ 49 సార్లు మూడంకెల స్కోరును అందుకున్నాడు. సచిన్‌ను అధిగమించడానికి విరాట్‌కు మరో రెండు సెంచరీల దూరంలో నిలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో కోహ్లికి ఇది మూడో శతకం. అందులో రెండు బంగ్లాదేశ్‌పైనే చేయడం విశేషం. ఇలా ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. అతడి కంటే ముందు.. కెన్యాపై సచిన్, కెన్యాపై గంగూలీ, బంగ్లాదేశ్‌పై రోహిత్ రెండేసి శతకాలు చేశారు. అలాగే ఛేజింగ్‌లో అతడికి ఇదే తొలి వరల్డ్‌ కప్‌ సెంచరీ. స్టేడియాల జాబితాలోనూ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఒకే వేదికపై 500+ పరుగులు చేయడం విరాట్‌కు ఇది ఐదోసారి. పుణె వేదికగా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 94.34 స్ట్రైక్‌రేట్‌తో 551 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 800, కొలొంబోలో 644, విశాఖపట్నం పిచ్‌పై 587, ట్రినిడాడ్‌లో 571 పరుగులు చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం