ప్రపంచకప్ కోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం నెదర్లాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత జట్టుతో లేడని సమాచారం. వ్యక్తిగత కారణాలతో ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా వీడియోను బీసీసీఐ ఆదివారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కోహ్లి కనిపించలేదు. మరోవైపు కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలకు ఈ విషయం మరింత బలాన్ని చేకూర్చింది. రీసెంట్గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్ వద్ద విరాట్-అనుష్క కనిపించడంతో… అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు వరుసగా కథనాలు వస్తున్నాయి. అంతేగాక అనుష్క కొన్ని రోజులుగా కెమెరాకు దూరమైంది. భర్త విరాట్ మ్యాచులకు కూడా ఆమె హాజరుకావడం లేదు. దీనికితోడు గణేశ్ చతుర్ధికి ఆమె పెట్టిన పోస్టు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉంది. దీంతో విరాట్ దంపతులు తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నారని కథనాలు వస్తున్నాయి.
342
previous post