స్టార్ హీరో విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సూర్య ‘నానుమ్ రౌడీ’, ‘ముగిజ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్ధాయిలో శిక్షణ తీసుకున్న సూర్య సేతుపతి ఇప్పుడు ‘ఫీనిక్స్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా అరసు వర్క్ చేశాడు. అరసుకు కూడా డైరెక్టర్‌గా ఇదే తొలి సినిమా. ఈ మూవీకి సీఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక తమిళ హీరో విజయ్ సేతుపతికి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన నటనతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. 1996లో విడుదలైన ‘లవ్‌బర్డ్స్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విజయ్ సేతుపతి.
438
previous post