కోలీవుడ్ స్టార్‌హీరో విజయ్ ‘లియో’ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీవసూళ్లతో దూసుకుపోతుంది. అయితే లియో సినిమా రిలీజైన టైమ్ లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లియో సక్సెస్ మీట్‌లో విజయ్.. ఫ్యాన్స్ వార్, ట్రోల్స్‌పై మాట్లాడాడు. ”సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ కోపం చూపిస్తున్నారు. మనకి అది వద్దు. అందరితో స్నేహంగా ఉందాం” అని విజయ్ అన్నాడు. ”తమిళంలో ఒక్కరే పురచ్చి తలైవార్, ఒక్కరే నడిగర్ తిలకం, ఒక్కరే కెప్టెన్, ఒక్కరే సూపర్ స్టార్, ఒక్కరే ఉలగనాయగన్, ఒక్కరే తలా.. ఇక దళపతి ఎవరో మీకు తెలుసు. రాజు ఆదేశాన్ని పాటించి సేవ చేసేవాడే దళపతి. మీరంతా నా రాజులు, నేను మీ సేవకుడ్ని” అంటూ స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరినీ కూల్ చేశాడు. కాగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.