Vijay Antony- స్టార్‌ హీరో హార్ట్‌ బ్రేక్‌.. సూసైడ్‌కు కారణమదేనా?

బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని నివాసంలో ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా వెంటనే ఆస్పుత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో12వ తరగతి చెందుతున్న ఆమె తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మరణానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..