Video- చిరుతతో సెల్ఫీలు.. ఓ వ్యక్తి స్వారీకి ప్రయత్నం

చిరుత (leopard)ను చూస్తే ఎవరైనా ప్రాణ భయంతో పారిపోతుంటారు. కానీ అక్కడ గ్రామస్తులంతా చిరుత చుట్టూచేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఓ వ్యక్తి మరీ మితిమీరి ఏకంగా ఆ చిరుతపై కూర్చుని స్వారీ చేయాలని ప్రయత్నించాడు. అవును, ఇది నిజమే! అయితే అనారోగ్యంతో చిరుత బాధపడుతుండటతో గ్రామస్తులు ఈ సాహసం చేశారు.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దెవాస్ జిల్లాలోని ఇక్లేరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇక్లేరా గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. భయంతో అందరూ వణికిపోయారు. కానీ ఎంత సేపు చూసినా ఆ చిరుత దాడి చేయడం, గాండ్రించడం చేయలేదు. అలసిపోయి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దీంతో పులి అనారోగ్యంతో బాధ పడుతోందని గ్రామస్థులు నిర్ధారణకు వచ్చారు. చిరుతను చూడాలని సరదా పడ్డారు. దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు.

కాగా, గ్రామస్తులు పులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సహాయ బృందంతో కలిసి అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉజ్జయిని నుంచి బోను తెప్పించి చిరుతను బంధించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం