Video- కూలిన వంతెన.. పరిగెత్తుతూ ప్రాణం వదిలాడు

గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. వంతెన కూలిపోవడాన్ని గమనించిన అతడు వేగంగా పరిగెత్తాడు. కానీ కాంక్రీట్ స్లాబులు అతడిపై పడిపోవడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యం అందర్నీ కలచివేస్తోంది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వాటికింద చిక్కుకుపోయినట్లు ఘటనా స్థలంలోని వ్యక్తులు చెప్పారు. ఆటోతో పాటు ట్రాక్టర్ కూడా వాటికింద నుజ్జునుజ్జు కావడంతో వారు కూడా చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇది పాలన్‌పుర్‌-అంబాజీని అనుసంధానించే రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌. పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ వంతెనకు ఇటీవలే ఆరు కాంక్రీట్‌ స్లాబులు అమర్చారు. అవి సోమవారం కూలిపోయాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..