తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరు అయ్యారు. అయితే వరుణ్‌తేజ్-లావణ్య పెళ్లి వేడుక ottలోకి వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఓ ప్రముఖ ott సంస్థ రూ.8 కోట్లు ఆఫర్ చేసిందని, దీనికి వరుణ్‌లవ్ కూడా అంగీకరించారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వరుణ్‌తేజ్ టీమ్ స్పష్టం చేసింది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆనంద క్షణాల్ని ఓటీటీలో పెట్టే ఆలోచన లేదని తెలిపింది. దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు.