Uttar Pradesh- షాక్‌.. బ్యాంక్‌ లాకర్‌లో రూ.18 లక్షలకు చెదలు

బ్యాంక్‌ లాకర్‌లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో జరిగింది. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. తన కూతురు పెళ్లి కోసం గతేడాది అక్టోబర్‌లో రూ.18 లక్షల డబ్బుతోపాటు విలువైన నగలను లాకర్‌లో ఉంచింది. తాజాగా కేవైసీ, లాకర్‌ అగ్రీమెంట్‌ రెన్యువల్‌ కోసం బ్యాంక్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె లాకర్‌ ఓపెన్‌ చేయగా షాక్‌కు గురైంది. చెదల ధాటికి డబ్బంతా ముక్కలు ముక్కులుగా, నల్లని మట్టిగా మారిపోయాయి. నగలు మాత్రం భద్రంగానే ఉన్నాయి. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్​ కేసును విచారిస్తున్నట్లు చెప్పారు. అయితే బ్యాంక్​ లాకర్​లో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని ఆ మహిళ పేర్కొంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం