అమావాస్యలో నేరాలు: పంచాగాన్ని ఫాలో అవుతున్న పోలీసులు

నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ డీజీపీ విజయ్ కుమార్‌ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. దాంతో పాటు హిందూ పంచాంగాన్ని కూడా జత చేశారు. దాని సహాయంతో అమావాస్యకు ఒక వారం ముందు, ఒక వారం తర్వాత గస్తీని ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. హత్య, దోపీడీ, దొంగతనం వంటి ఘటనలను అరికట్టాలని తెలిపారు.

అయితే ఈ నిర్ణయంపై నెట్టింట్లో చర్చ జోరుగా సాగుతోంది. నేరాలను కట్టడిచేయడానికి గస్తీని పెంచడం సరైన నిర్ణయమేనని, కానీ పంచాగాన్ని చూసి ఆలోచించడమే విడ్డూరంగా ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు. నేరస్తులు ముహూర్తాలు, పంచాంగాలను చూసి నేరాలు చేస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం