capture
Home » ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం

ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం

by admin
0 comment

కన్నడ స్టార్‌హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ నుంచి చిత్రీకరణ చేసినట్టుగా ఉండే ఈ సినిమా పేరు… ‘క్యాప్చర్‌’. లోహిత్‌.హెచ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ”ఇంతవరకూ సినీ ప్రపంచంలో రానటువంటి ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్‌ లెన్స్‌తో తీసిన తొలి సినిమా కూడా ఇదే” అని డైరెక్టర్‌ లోహిత్‌ చెప్పారు. రాదికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం గోవాలో 30 రోజుల పాటు జరిగింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ ను విడుదల చేశారు. అందులో ప్రియాంక నెత్తుటి మరకలతో నవ్వుతూ కనిపించారు. మరోవైపు, ఆమె చుట్టూ సీసీ కెమెరాలు, కొందరు వ్యక్తుల చేతులు, ఓ కెమెరాపై కాకి కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links