Maharashtra- కుప్పకూలిన ఫ్లైఓవర్‌

నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో భాగంగా చిప్లన్‌ నగరంలో గతకొంత కాలం నుంచి ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బ్రిడ్జికి ఓ చోట పగుళ్లు వచ్చినట్లు సోమవారం ఉదయం అధికారులు గుర్తించారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్లపై ఉన్న ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం