TSRTC: స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌.. టికెట్లపై రాయితీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌ న్యూస్ తెలిపింది. ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. అయితే ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన వారికి 50% రాయితీ ఇవ్వనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్‌ నగరంలో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్‌ ధర రూ.50గా నిర్ణయించింది. రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..