TS News: ఆ తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక క్యాంప్‌

దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు సెప్టెంబర్‌ 3,4 తేదీల్లో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లో ఈ క్యాంపేయిన్ ఉంటుంది. ఇక్కడ ఓటు నమోదు ప్రక్రియతో పాటు సవరణను కూడా చేసుకోవచ్చు. వచ్చే అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటు నమోదుకు అర్హులే. పూర్తి వివరాల కోసం 1950కు కాల్ చేయండి.

సెప్టెంబర్‌ 28తేదీ వరకు వచ్చే ఓటు దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను వెలువరించనుంది. కాగా, అక్టోబరు రెండో వారంలోగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఈసీ యోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ,మిజోరం రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..