TS News: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్ పరీక్ష రద్దు

గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూన్‌లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదుల చేయగా, సెప్టెంబర్‌ 4న పరీక్షను నిర్వహించారు. 77,907 మంది పరీక్ష రాశారు.

అయితే ప్రశ్నాపత్నం లీక్‌ అయిందని గతంలోనే వార్తలు వచ్చాయి. గోవాలో కొందరు అభ్యర్థులు పరీక్ష రాశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పరీక్ష జరిగిన సమయంలో అభ్యర్థులను తనిఖీ చేయలేదనీ, ప్రశ్నాపత్రాన్ని ఎలాంటి సీలు లేకుండా ఇచ్చారని పరీక్ష నిర్వహించిన తీరుపై అభ్యర్థులు విమర్శించారు. అయితే వాటిని సింగరేణి యాజమాన్యం ఖండించింది. అనంతరం అభ్యర్థుల మార్కులను విడుదల చేసింది. కానీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్‌ ఉండటంతో మెరిట్‌జాబితాను ప్రకటించలేదు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..