నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వాటిలొ పాఠశాల విద్యలో 5,089; స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయన్నారు.