TS DSC: 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్‌ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్‌జీటీ, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా డీఎస్సీ నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..