masala
Home » Heroes Makeover | టాలీవుడ్ హీరోలు – మేకోవర్లు

Heroes Makeover | టాలీవుడ్ హీరోలు – మేకోవర్లు

by admin
0 comment

ఒకప్పుడు మేకోవర్ కు అంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు కాదు హీరోలు. గెటప్ మారిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనే భ్రమల్లో ఉండిపోయేవారు. కొంతమంది హీరోలైతే తమ మీసకట్టు మార్చడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలామంది టాలీవుడ్ హీరోలు పాత్రలకు తగ్గట్టు తమ ఫిజిక్ తో పాటు లుక్ ను కూడా మార్చుకుంటున్నారు.

మగధీర నుంచే రామ్ చరణ్ మేకోవర్లు మొదలుపెట్టాడు. ఆరెంజ్, ధృవ, రంగస్థలం లాంటి సినిమాల్లో కొత్తగా కనిపించాడు. ఇక ఆర్ఆర్ఆర్ లో చరణ్ విశ్వరూపం చూడొచ్చు. త్వరలోనే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీలో కూడా చరణ్ గెటప్ కొత్తగా ఉండబోతోంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

మేకోవర్లకు దూరంగా ఉండే మహేష్ బాబు కూడా కొద్దిగా మారినట్టు కనిపిస్తోంది. ప్రతి సినిమాలో దాదాపు ఒకే రకంగా కనిపించే ఈ హీరో.. సర్కారువారి పాట సినిమాలో కాస్త కొత్తగా కనిపించాడు. హెయిర్ స్టయిల్ మార్చాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరుకారం సినిమాలో ఏకంగా మాస్ అవతార్ లో కనిపించి మెప్పించాడు.

ఎప్పటికప్పుడు తన ఫిజిక్ తో పాటు లుక్స్ కూడా మార్చడం ప్రభాస్ కు ఇష్టం. బాహుబలి సినిమాలో కంప్లీట్ వేరియేషన్స్ చూపించిన ఈ హీరో.. రాధేశ్యామ్ మూవీలో లవర్ బాయ్ గా.. ఆదిపురుష్ లో శ్రీరామచంద్రుడిగా కనిపించాడు. ఇక సలార్ లో మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. ఇవన్నీ వేటికవే విభిన్నమైన గెటప్పులు.

మేకోవర్స్, బాడీ బిల్డింగ్ కు పూర్తిగా దూరంగా ఉండే హీరో పవన్ కల్యాణ్. ఈ హీరో మీసకట్టు మార్చినా ఫ్యాన్స్ ఒప్పుకోరు. తన ప్రతి సినిమాలో దాదాపు ఒకేలా కనిపించే పవన్ కల్యాణ్.. హరిహర వీరమల్లు సినిమాలో మాత్రం కాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.

తన లుక్ లో వేరియేషన్స్ కోసం విపరీతంగా కష్టపడడం ఎన్టీఆర్ కు ఇష్టం. యమదొంగలో స్లిమ్ గా కనిపించినా, ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో అల్ట్రా మోడ్రన్ గా ఆకట్టుకున్నా, టెంపర్ కోసం సిక్స్ ప్యాక్ చేసినా అన్నీ వేటికవే క్లిక్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ లో భీమ్ గా మెరిసిన ఈ హీరో.. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో చేస్తున్న దేవర కోసం కూడా అంతే కొత్తగా ముస్తాబయ్యాడు.

పుష్పలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కంప్లీట్ మేకోవర్ చూపించాడు. బాగా జుట్టు, గడ్డం పెంచిన బన్నీ లుక్ జాతీయ స్థాయిలో క్లిక్ అయింది. ఇప్పుడు పార్ట్-2లో కూడా అదే గెటప్ తో రెడీ అవుతున్నాడు.

ఇలాంటి మేకోవర్స్, గెటప్స్ విషయంలో బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన ప్రతి సినిమాలో అంతోఇంతో కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు ఈ సీనియర్ హీరో. కథతో సంబంధం ఉన్నా, లేకపోయినా రకరకాల గెటప్పులు ట్రై చేస్తాడు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న భగవంత్ కేసరి సినిమాలో కూడా కొత్తగా ఉన్నాడు బాలయ్య.

ఈ హీరో కూడా మేకోవర్స్ గ్యాంగ్ లోకి చేరిపోయాడు. ఇన్నాళ్లూ సాఫ్ట్ గా, లవర్ బాయ్ గా కనిపించిన ఈ అక్కినేని హీరో.. ఏజెంట్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. సాఫ్ట్ గా కనిపించే హీరో రెబల్ గా మారిపోయాడు. లవర్ బాయ్ కాస్తా మాస్ అబ్బాయి గా మారిపోయాడు.

క్యారెక్టర్ బాగుంటే ఎలాంటి మేకోవర్ కైనా సిద్ధం వెంకటేష్. కథల ఎంపికలో మిస్టర్ పెర్ ఫెక్ట్ అనిపించుకున్న ఈ హీరో, తాజాగా నారప్ప గెటప్ తో మెప్పించాడు. ఓరి దేవుడా, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాల్లో కూడా కొత్తగా కనిపించాడు. ఇక అప్ కమింగ్ మూవీ సైంధవ్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు.

రామ్.. ఒకప్పుడు ఈ హీరో మేకోవర్స్ కు దూరం. కానీ ఇస్మార్ట్ శంకర్ నుంచి రామ్ మైండ్ సెట్ మారిపోయింది. ఇస్మార్ట్ లో పక్కా మాస్ గా కనిపించిన ఈ హీరో.. ఆ తర్వాత రెడ్, వారియర్ సినిమాల్లో అంతకుమించి మాస్ గా కనిపించాడు. ఇక బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో రామ్ మాస్ లుక్ అదిరింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links