Tollywood- హీరోయిన్లలో నలుగురే పాపులర్‌

2021 లో టాలీవుడ్ (Tollywood)లో అడుగుపెట్టిన హీరోయిన్లలో ఓ నలుగురు పాపులర్ అయ్యారు. మిగతా వాళ్లంతా ఫెయిల్ అయ్యారు. ప్రతీ సంవత్సరం ఓ 10 శాతం సినిమాలే హిట్టయి, మిగతా 90 శాతం అడ్రసు లేకుండా పోవడంతో, ఓ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన కొత్త హీరోయిన్లు మళ్ళీ కనిపించకుండా పోతున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా స్టార్ సినిమాల్లో నటిస్తేనే. చిన్న, మధ్య తరహా సినిమాల్లో నటించే కొత్త హీరోయిన్లు మాత్రం మళ్ళీ రిపీటవరు. స్టార్ సినిమాల్లో పరిచయమైతేనే రిపీటవుతారు.

ఒకప్పుడు చిన్న సినిమాలకంటూ స్టార్ హీరోయిన్లు ఉండే వాళ్ళు. రోజారమణి, ప్రభ, గీత, రజనీ లాంటి వాళ్ళు. గుర్తింపు పొందిన వీళ్ళు నటించే చిన్న సినిమాలకి ప్రేక్షకాదరణ ఉండేది. తర్వాతి కాలంలో రవళి, గజలా, రైమా సేన్, సింధు తులానీ లాంటి హీరోయిన్లు చిన్న సినిమాల్లో రిపీటై వాళ్ళ పాపులారిటీతో సినిమాలు అడేవి. ఈ బిజినెస్ మోడల్ ఇప్పుడు పోయింది.

రెండేళ్ళ క్రితం పరిచయమైన ఎందరో హీరోయిన్లలో ప్రస్తుతం నలుగురు మాత్రమే మిగిలారు. శ్రీలీల, కృతీశెట్టి, కేతికా శర్మ, ఫరియా అబ్దుల్లా మాత్రమే కనిపిస్తున్నారు. మిగతావాళ్లంతా తెరమరుగయ్యారు. ‘పెళ్ళి సందడి’ తో శ్రీలీల, ‘ఉప్పెన’ తో కృతీశెట్టి, ‘రోమాంటిక్’ తో కేతికా శర్మ, ‘జాతి రత్నాలు’ తో ఫారియా అబ్దుల్లా. ఈ నల్గురూ తర్వాత పెద్ద స్టార్లు నటించే సినిమాల్లో స్టార్ హీరోయిన్లయి పోయారు.

ఇక చిన్న, మధ్య తరహా సినిమాలతో పరియమైన తాన్యా రవిచంద్రన్, కాశిష్ ఖాన్, లవ్లీ సింగ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, అవంతిక, అమ్ము అభిరామి, అనన్యా నాగళ్ళ, సంచిత, చిత్రా శుక్లా, కావ్యా థాపర్, సిమ్రాన్ చౌదరి, వైశాలీ రాజ్ లాంటి దాదాపు 40 మంది హీరోయిన్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఆశ్చర్యంగా వీళ్ళని పరిచయం చేసిన నిర్మాతలూ దర్శకులూ కూడా కనిపించలేదు.

ప్రతీ సంవత్సరం ఇలానే జరుగుతోంది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకొచ్చిన అమ్మాయిలు, రెండేళ్లకే వెనక్కు వెళ్లాల్సి వస్తోంది. ఈ కల్చర్ మారాలంటున్నారు సినీ విమర్శకులు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం