వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ కట్నకానుకులు, చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని తెగల్లో వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగకు చెందిన ప్రజలు.. ఆడపిల్లకు పెళ్లి చేస్తే వరుడికి పాములను కట్నంగా ఇస్తారని విన్నాం. ఇప్పుడు కట్నం గురించి మరో వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. నీలగిరి కొండల్లో ఉండే తోడా ఆదివాసులు గేదెలను పుట్టింటి కానుకగా ఇస్తారు. తోడా అనే కొండజాతి గేదెలను వారు పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లి సమయంలో కట్నంగా బోలెడు గేదెలు ఇస్తారు. అంతేగాక అమ్మాయికి బిడ్డ పుడితే మేనమామ ఇంటి నుంచి ఓ గేదెను కూడా పంపిస్తారంట. అయితే ఇటీవల తోడా గేదెలు సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండటం వారిని కలవరపెడుతోంది.