kohli
Home » Virat Kohli- కోహ్లి గురించి ఆందోళన.. ఎందుకలా చేస్తున్నాడు?

Virat Kohli- కోహ్లి గురించి ఆందోళన.. ఎందుకలా చేస్తున్నాడు?

by admin
0 comment

బుల్లెట్స్‌లా శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని కూడా అవలీలగా ఫ్లిక్ షాట్‌తో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి (Virat Kohli) బౌండరీలు రాబడతాడు. కానీ పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్న కోహ్లి లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌లో తడబడుతున్నాడు. ఈ ఏడాదిలో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ బౌలింగ్‌లో అతడు ఇప్పటికే 4 సార్లు ఔటయ్యాడు. ఇక 2021 నుంచి ఆడిన 28 వన్డేల్లో కోహ్లీ 8 సార్లు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వీరిలో సాంట్నర్, షకీబ్ అల్ హసన్, మహరాజ్ రెండేసి సార్లు ఔట్ చేశారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనూ అదే తరహా ప్రదర్శనను కోహ్లి కనబరిచాడు. గత సీజన్ మొదటి అర్ధభాగంలో కోహ్లీ ఐదుసార్లు ఔటైతే అందులో 4 సార్లు స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. లలిత్ యాదవ్, అమిత్ మిశ్రా, హర్‌ప్రీత్ బ్రార్, సునీల్ నరైన్ కోహ్లీ వికెట్ తీసుకున్నారు. ఇక స్ట్రైక్‌ రేట్‌లోనూ పేస్‌తో పోలిస్తే స్పిన్‌లో తక్కువగా ఉంది. వచ్చే నెల నుంచి ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లి ఈ తడబాటు నుంచి బయటపడాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links