Rahul Gandhi: లోక్‌సభకు రాహుల్‌ గాంధీ రీఎంట్రీ.. ఉత్తర్వులు జారీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి ‘ఇండియా’ నేతలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, ‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యల కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజాపాతినిథ్య చట్టం ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో శిక్ష నిలుపుదలపై రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం శిక్ష నిలుపుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు సోమవారం ప్రారంభమైన లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం నుంచి రాహుల్ గాంధీ లోక్ సభ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం