సెమీస్‌కు దేవుడిపైనే భారం: పాకిస్థాన్‌

వన్డే వరల్డ్‌ కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్‌కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్‌ అవకాశాలపై దేవుడిపైనే భారం వేశామని పాకిస్థాన్‌ టీమ్‌ డైరెక్టర్‌ మికీ ఆర్థర్‌ అన్నాడు. ‘‘ప్రపంచకప్‌లో మా ప్రయాణం ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. కానీ తప్పకుండా సెమీస్‌కు చేరుకుంటామని ఆశిస్తున్నాం. దానికోసం గట్టిగానే ప్రయత్నిస్తాం. అలాగే భగవంతుడి సాయం కూడా కావాలి. అయితే ఓపెనర్ ఫకర్ జమాన్‌ రాకతో బ్యాటింగ్‌ బలోపేతమైంది. మెగాటోర్నీలో కొన్నిసార్లు టీమ్‌లో స్ఫూర్తి నింపాల్సి ఉంటుంది. అది ఫకర్ జమాన్ రూపంలో వచ్చిందనుకుంటా. ఇదే దూకుడు కొనసాగించి ఇంగ్లాండ్‌ను ఓడించడానికి ప్రయతత్నిస్తాం’’ అని మికీ ఆర్థర్‌ తెలిపాడు. శనివారం ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం