యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. RRR సినిమాతో ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్స్‌లోనూ మెరిసింది. అయితే అకాడమీ.. తన యాక్టర్స్ బ్రాంచ్‌లో కొత్త సభ్యులను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ కొత్త సభ్యుల్లో కే హుయ్ క్వాన్, మర్షా స్టీఫనీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆహ్వానం మేరకు యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వం పొందుతుంటారు. మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో డిస్టిక్షన్ సాధించిన వాళ్లకు, వెండితెరపై ప్రతిభను చాటుకున్నవాళ్లలో కొంత మందికి మాత్రమే ఈ సభ్యత్వానికి ఆహ్వానాలు పంపుతారు. అలాగే యాక్టింగ్ కేటగిరీలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యి ఉండాలి. ఈ నిబంధనలన్నీ పరిగణనలోకి తీసుకుని ఎన్టీఆర్‌ను ఎంపిక చేశారు.
333
previous post