vikram
Home » Thangalaan- వణికిస్తోన్న విక్రమ్‌ ‘తంగలాన్’ టీజర్‌

Thangalaan- వణికిస్తోన్న విక్రమ్‌ ‘తంగలాన్’ టీజర్‌

by admin
0 comment

విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’. కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఓ తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్‌ నటన అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. విక్రమ్‌ చాలా వైల్డ్​గా, భయంకరంగా కనిపిస్తున్నాడు. లుక్స్​, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను బాగా హైలైట్ చేశాయి. టీజర్‌ చివర్లో.. ”రక్తపాతం జరిగే యుద్ధాలతో స్వేచ్ఛ లభిస్తుంది. సన్​ ఆఫ్ గోల్డ్​ ఉదయిస్తున్నాడు” అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చారు. అయితే ఈ టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కానీ లుక్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పాన్‌ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links