TSPSC ఆఫీస్‌ ముందు ఉద్రిక్తత.. Group 2 వాయిదాకు డిమాండ్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని భారీ సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 2వేల మంది అభ్యర్థుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరించారు. కాగా, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు.

గురుకుల, ఇతర నియామక పరీక్షలు వరుసగా ఉండటంతో గ్రూప్‌-2 వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థిస్తున్నారు. అంతేగాక నోటిఫికేషన్‌లో అదనంగా సిలబస్‌ జతచేయడంతో సన్నద్ధమవ్వడానికి మరికొంత సమయం కావాలని అభ్యర్థులు వినతి పత్రాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 29,30న నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో ఇవాళ పిటిషన్‌ దాఖలు చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..