TS
Home » Telangana- వ్యూహాలు మొదలయ్యాయి.. 15న మేనిఫెస్టో

Telangana- వ్యూహాలు మొదలయ్యాయి.. 15న మేనిఫెస్టో

by admin
0 comment

తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్‌ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ వచ్చే ఆదివారం మేనిఫెస్టోను విడుదుల చేయనుంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. అదే రోజు అభ్యర్థులందరితో సమావేశమై వారికి బీ-ఫార్మాలు అందజేయనున్నారు. అయితే కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ పలు కార్యక్రమాలకు దూరమైన సీఎం.. హుస్నాబాద్‌లో నిర్వహించే సభతో ప్రచారాలకు శ్రీకారం చుట్టునున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక 115 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులంతా నెలరోజులుగా పూర్తిగా నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్రంలో దూకుడు పెంచింది. మూడు నెలలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కర్ణాటక తరహాలో ప్రకటించిన ఆరు గ్యారంటీలపై నమ్మకం పెట్టుకుంది. దీనితో పాటు అధికారపార్టీపై ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే షెడ్యూలుకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకొన్నా ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు తమ పార్టీలో చేరడం, పలు ప్రీ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలం రావడం.. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం తీసుకొస్తుంది.

ఇక బీజేపీ కూడా మరింత వేగం పెంచింది. ఇప్పటికే మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించింది. మరోవైపు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొన్ని రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అనేక పథకాలు ప్రారంభించిందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా హోంమంత్రి అమిత్‌షా సైతం ఇవాళ ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links