Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు

ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధ్రువీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

కాగా, 1949 జూన్ 5న తూప్రాన్లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. ఉద్యమంలో తన పాటతో ఎంతోమందిని ఉత్తేజపరిచారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకు నంది అవార్డు కూడా అందుకున్నారు. అయితే నంది అవార్డును తిరస్కరించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..