దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు: రాహుల్‌ గాంధీ

రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని విమర్శించారు. కానీ ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ తప్పకుండా నిలబెట్టుకుంటుందని అన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చామని, దాని వల్ల తమ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ చిరునామా కోల్పోయిందిని, ఇక్కడ బీఆర్‌ఎస్‌ గెలవాలని బీజేపీ కోరుకుంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయని, వాటితో ఎంఐఎం కూడా కలిసే ఉందని అన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..