Telangana- పెట్టుబడుల ప్రవాహం.. మరో రూ.934 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ ను తయారు చేయనుంది. భారతదేశంలో ఇలాంటి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్‌కు తెలంగాణ తొలి కేంద్రం కానుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా 800 మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జాన్ బెయిని ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ అమెరికాలో సమావేశమయ్యారు.

తెలంగాణకు అనేక అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఈ అంశం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రంగా తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కార్నింగ్ సంస్థకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..