387
రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను మార్పు చేసినట్లు సీఎం తెలిపారు. మెట్‌పల్లి, ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ రెండు నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీచేయనున్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత పేరును తొలి జాబితాలో ప్రకటించలేదు.
బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా