kcr
Home » Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

by admin
0 comment

రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 95 నుంచి 105 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని వారి జాబితాను తొలుత విడుదుల చేయనున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిసినప్పటికీ.. వారిలో ఎంతమందికి మొండిచేయి చూపుతారని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఆశావాహులు పార్టీ కీలక నేతలను కలిసి టికెట్‌పై విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, అసంతృప్తులపై సీఎం ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, ఈ విషయంపై మంత్రులతో చర్చించారని సమాచారం. ఎమ్మెల్యేలను తప్పనిసరిగా మార్చాల్సిన పరిస్థితుల్లో వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links