మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రతాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మియాపూర్‌లో చేసిన తనిఖీలో ఏకంగా 17 కేజీల బంగారం, 17.5 కిలోల వెండీని సోమవారం సీజ్‌ చేశారు. వాటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. మరోవైపు గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో రూ.2.09 కోట్లు, వనస్థలిపురంలో రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అయ్యప్ప సొసైటీలో రూ.32 లక్షల నగదు, గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో రూ.10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..