మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం. తమన్నా-విజయ్ వర్మ లవ్ మేటర్ ఈ ఏడాది స్టార్టింగ్‌లో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పట్లో మ్యారేజ్ ఉండకపోవచ్చని గతంలో తమన్నా ఓ సందర్భంలో చెప్పింది. కానీ తమన్నా తల్లిదండ్రులు పెళ్లి విషయమై ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట. వయసు కూడా పెరిగిపోతుందని, త్వరలో పెళ్లి చేసేసుకుంటే ఓ పనైపోతుందని అంటున్నారట. దీంతో మిల్కీబ్యూటీ కూడా వివాహానికి ఓకే చెప్పేసిందట. ‘లస్ట్‌స్టోరీస్ 2’లో కలిసి నటించిన విజయ్ వర్మ-తమన్నా.. ఆ సిరీస్ షూటింగ్ టైమ్‌లోనే ప్రేమలో పడ్డారు.