కెప్టెన్‌గా సూర్యకుమార్‌- సెలక్టర్లకు శాంసన్‌ కనిపించట్లేదా?

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. అదే జట్టుతో నవంబర్‌ 23 నుంచి టీ20 సిరీస్‌ ఆడనుంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్‌ ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చింది. శ్రేయస్‌ అయ్యర్‌ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే సంజు శాంసన్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అలాగే ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన రియాన్‌ పరాగ్‌కు కూడా మొండిచేయి చూపించారు. జట్టు వివరాలు: సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్‌ జరగనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం