AP News- సెలవుపై జైలు సూపరింటెండెంట్‌.. చంద్రబాబు సేఫేనా?

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే సూపరింటెండెంట్ సెలవుపై వెళ్తుండటంతో చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆయన సెలవుపై వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నారా లోకేష్, నారా భువనేశ్వరి రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరారు. దిల్లీలో వారు ఎవరెవరిని కలుస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం